వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు ఎస్.సి.యెన్.ఆర్ కళాశాలలో నేడు వేలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసే సదుద్దేశంతో ప్రభుత్వం ఉందని, అయితే ఇది వ్యయంతో కూడుకున్న పని కనుక, ప్రభుత్వం దాతల కోసం ఎదురు చూస్తోందని, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మీనాపురం (జగనన్నకాలనీ) వద్ద రెండు ఎకరాల సొంత స్థలాన్ని ఉర్దూ కళాశాల నిర్మాణం చేపట్టటానికి లిఖితపూర్వక అంగీకారం తెలిపారని, అందులో భాగంగానే ప్రొద్దుటూరులో 2023 విద్య సంవత్సరానికి గాను ఉర్దూ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసామని, 2023 విద్యా సంవత్సరానికి గాను పలు వృత్తివిద్యా కోర్సులు ఉర్దూ మీడియంలో ప్రవేశాలు జరగనున్నట్లు, ఇది పట్టణంలోని ముస్లిం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నట్లు భావించారు.
2018 నుండి ప్రక్రియ ప్రారంభం కాగా నేటికీ కార్యరూపం దాల్చిందని, స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు ప్రభుత్వాన్ని ఉర్దూ కళాశాల ఏర్పాటు విషయమై కోరినట్లు గుర్తుచేశారు. రాయలసీమ జిల్లాలలో ఇది రెండవ ఉర్దూ కళాశాల అని, మొదటిది కర్నూల్ పట్టణంలో స్థాపించబడినది. అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉండటం యూజీసీ ఇక్కడ ఉర్దూ కళాశాల ఏర్పాటుకు అంగీకారం తెలిపిందని త్వరలో పనులు చేప్పట్టబోతున్నట్లు, మౌలిక వసతుల కల్పనపై ద్రుష్టి సారించామని, ప్రస్తుత వ్యవస్థకు అనుగుణంగా వృత్తివిద్యా కోర్సులు కూడా ఇందులో ఉన్నట్లు, అన్ని సబ్జెక్టులకు బోధనా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులకు విద్యతో పాటు వృత్తి నైపుణ్యం కూడా నేర్పించనున్నామని అందులో భాగంగానే HPU, HEP, MPC, MSC(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్) BZC, BCOM కోర్సులలో ప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. రవీందర్, ఎస్.సి.యెన్.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్, బోధనా సిబ్బంది, పట్టణంలోని మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
Comentários