top of page
Writer's picturePRASANNA ANDHRA

ఉర్దూ భాషకు రెండో అధికార భాష హోదా కల్పించటం పట్ల హర్షం - అంజాద్ బాషా

వై.ఎస్.ఆర్. కడప జిల్లా, రాయచోటి విలేకరి (ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ)

కడప, ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా మైనారిటీ సబ్ ప్లాన్, ఉర్దూకు అధికార భాష హోదా కల్పించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు.

ఆదివారం అంజుమన్ తరక్కీ ఉర్దూ ఆధ్వర్యంలో నగరంలోని షాహి దర్బార్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సబ్ ప్లాన్ మరియు ఉర్దూ భాషకు రెండో అధికార భాష హోదా కల్పించినందుకు ఉపముఖ్యమంత్రి , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్ బి.అంజాద్ బాషా కు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్ బి.అంజాద్ బాషా మాట్లాడుతూ ప్రపంచ భాష ఆయిన ఉర్దూ భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ,రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైనార్టీల పక్షపాతి అని , మైనారిటీ సబ్ ప్లాన్ , ఉర్దూకు అధికార భాష హోదా చరిత్ర లో సువర్ణక్షరాలతో లిఖించే విషయమని త్వరలోనే ఉర్దూ మీడియం పాఠశాలల , కళాశాలల , విశ్వ విద్యాలయాల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కోన్నారు.


ఈ కార్యక్రమాని కి గౌరవ అతిధిగా హాజరైనా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎం ఎల్ సి కత్తి నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఉర్దూ భాష కు ద్వితీయ అధికార భాష హోదా, మైనారిటీ సబ్ ప్లాన్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసకున్న చారిత్రక నిర్ణయమని, ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.


సభకు అధ్యక్షత వహించిన అంజుమన్ తరక్కి ఉర్దూ అధ్యక్షులు సత్తార్ ఫైజి మాట్లాడుతూ ముఖ్య మంత్రి వై ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రపంచ భాష ఉర్దూకు ఉన్నత స్థానం కల్పించి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉర్దూ అధికారి పోస్టు మంజూరు చేసి భర్తీ చేయాలని, ఉర్దూ స్పెషల్ డి ఎస్ సి నిర్వహించాలని , జూనియర్, డిగ్రీ కళాశాలలలో ఉర్దూ మీడియం లెక్చరర్ల పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలని, యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఉర్దూ పరిశోధనలు ప్రారంభించాలని, ఆర్ టి సి బస్సుల పై , ప్రభుత్వ కార్యాలయాలపై ఉర్దూలో నేమ్ బోర్డు లు రాయించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ను కోరారు.


కార్యక్రమానికి కన్వీనర్ గా అంజుమన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ హిదాయతుల్లా, కో కన్వినర్ ప్రముఖ కవి యునుస్ తయ్యిబ్ వ్యవహంచారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆచార్య ఖాసిం అలీ ఖాన్, షహమీరియ పీఠాధిపతులు సయ్యద్ హూసైని బాషా , అహ్మద్ పీర్ షాహమీరి, ఆచార్య సయ్యద్ అబ్దుల్ సత్తార్ సాహిర్, డాక్టర్ నిసార్ అహ్మద్ లు పాల్గొని ప్రసంగించారు.


గౌరవ అతిథులుగా కేరళ రాష్ట్ర అంజుమన్ తరక్కి ఉర్దూ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ , జమిఅతే ఉలమా హింద్ జిల్లా అధ్యక్షులు హామిద్ హుసేన్,ఉలమ అయిమ్మ జిల్లా శాఖ అధ్యక్షులు సయ్యద్ షా నిజాముద్దీన్ బుఖారి, దారుల్ ఉలుం జియా ఉల్ బాఖియాత్ ప్రిన్సిపల్ ముఫ్తీ సయ్యీద్ అహ్మద్ బాఖవి, ఆస్తానయే బగ్దాదియ పీఠాధిపతి ముహమ్మద్ అలీ బగ్దాది, రూట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ ,ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్, ఏఐఐటిఏ రాష్ట్ర అధ్యక్షులు హాజీ అబ్దుల్ రజాక్, కార్వనే ఉర్దూ అధ్యక్షులు సయ్యీద్ ఖాన్, కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం.ముక్తార్ అహ్మద్, వినెట్ ఛైర్మన్ సయ్యద్ ఇఫ్తికార్ జమాల్, పాపులర్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మౌలాన జాకిర్ హుసేన్, డాక్టర్ వసివుల్లా ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఇలియాస్ బాషా, జిల్లా అధ్యక్షులు రమణ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు మహబూబ్ బాషా,అంజుమన్ తరక్కి ఉర్దూ శాఖ సభ్యులు అబ్దుల్ ఖాదర్ ఖాన్ దలాజక్, హాజీ రహమతుల్లా, నజీర్ అహ్మద్, ముహమ్మద్ ఇర్షాద్ ,వాహిద్, మక్బూల్,అయ్యూబ్ ఉర్దూ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, ఉర్దూ భాషాభిమానులు పాల్గొన్నారు.

62 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page