top of page
Writer's pictureEDITOR

సీపీఎస్ ను రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలుచేయాలి - యు టీ ఎఫ్

సీపీఎస్ ను రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలుచేయాలి - యు టీ ఎఫ్

సమావేశంలో ప్రసంగిస్తున్న హరి ప్రసాద్

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తానని మాట చెప్పి నేడు మడమ తిప్పడం అన్యాయమని.. సిపిఎస్ రద్దుచేసి ఓపీఎస్ ను అమలు చేయాలని అన్నమయ్య జిల్లా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.హరి ప్రసాద్, ఎస్ జాబీర్ లు తెలిపారు. సిపియస్ రద్దు చేయాలంటూ ఆదివారం జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో యు టీ ఎఫ్ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో మన ప్రభుత్వం వచ్చిన వారం రోజులలో సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఎటువంటి హామీ ఇవ్వని రాజస్థాన్, పంజాబ్, చత్తీస్ ఘడ్, అస్సాం, తమిళనాడు తదితర రాష్ట్రాలలో సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఓవైపు నిర్ణయం తీసుకుంటున్నాయని.. కానీ మన ప్రభుత్వం వస్తే వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులచే ఓట్లు వేయించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేడు సిపిఎస్ కంటే జిపిఎస్ మెరుగైందని చెప్పడం దుర్మార్గమైన చర్యగా వారు పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరో పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేశారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్ చంద్ర శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ సిపియస్ రద్దు కోసం జరిగే పోరాటాలకు సిఐటియు అండగా ఉంటుందని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

అలాగే యుటిఎఫ్ బలోపేతానికి కృషి చేయాలని తద్వారా ప్రభుత్వ విద్యా రంగం మరియు ఉపాధ్యాయుల హక్కుల సాధనకు బలమైన ఉద్యమాలు నిర్మించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ జిల్లా కన్వీనర్ రమణమూర్తి, జిల్లా కార్యదర్శి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చెంగల్ రాజు, రాజంపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణయ్య, నాగేంద్ర, పెనగలూరు మండల ప్రధాన కార్యదర్శి నరసింహా రావు, కోశాధికారి వినోద్ కుమార్, పుల్లంపేట మండల అధ్యక్షులు సాంబ శివ రావు, నందలూరు మండల ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి సుధాకర్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి నరసింహా, చిట్వేలు, ఓబులవారిపల్లి మండలాలకు చెందిన యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


5 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page