కోర్ట్ ఉత్తర్వులు గౌరవించండి - ఆర్డీవో
వాజపేయి నగర్ లో అక్రమంగా నిర్మించిన దాదాపు 120 కుటుంబాలు ఈనెల అనగా ఆగష్టు 24వ తేదీన హై కోర్టు తమకు ఇవ్వబడిన గడువులోగా ఇళ్లను ఖాళి చేయవలసిందిగా ఆర్డీవో శ్రీనివాసుల రెడ్డి కోరారు. నేడు ఎమ్మార్వో కార్యాలయం నందు ఆయన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాజపేయి నగర్ వివాదం సివిల్ తగాదా అని, ఇందులో ప్రభుత్వానికి గాని ప్రభుత్వ అధికారులకు గాని ఎలాంటి సంబంధం లేదని, అయితే న్యాయస్థాన తీర్పును గౌరవించి వాజపేయి నగర్ వాసులు ఇళ్లను ఖాళి చేయవలసిందిగా ఆయన కోరారు.
గతంలో వాజపేయి నగర్ వాసులే తమకు ఇల్లు ఖాళి చేయటానికి ఆరు నెలల గడువు కావాలని న్యాయస్థానాన్ని కోరగా 24వ తేదీతో ముగినున్నదని, ఖాళి చేయని పక్షంలో న్యాయస్థాన ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ అధికారుల స్థలాన్ని ఖాలీ చేయించి యజమానులకు స్థలం అప్పజెప్పమని పేర్కొన్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యాయని, ఇళ్ల పట్టాల కోసం ధరకాస్స్తు చేసుకున్న 110 కుటుంబాలకు వారికి, వారు కోరుకున్న చోట అన్ని వసత్తులు గల ఆధునిక సౌకర్యాలతో జగనన్న కాలనీలో గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో తాను ఏర్పాటు చేసిన సమావేశంలో వస్తావ స్థితిగతులు తెలియచేశానని, ఇక్కడి వాజపేయి నగర్ వాసులకు ఇల్లు కట్టించే బాధ్యత తమదే అని హామీ ఇచ్చారు.
Commentaires