వాజపేయి నగర్ వాసులకు ఎమ్మెల్యే భరోసా
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
స్థానిక వాజపేయి నగర్ హరిజన వాడలో గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రైవేట్ స్థలం నందు నివాసాలు ఏర్పాటు చేసుకున్న దాదాపు 120 కుటుంబాలతో నేడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి వారితో చెర్చించారు. కాగా ఆగష్టు 23వ తారీఖు లోగా స్థలం ఖాళీ చేయవలసిందిగా ఫిబ్రవరి 2022న కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకొంది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా తాను నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారితో సంప్రదించి వారి అనుమతితో ఖాళీ చేయించే ఏర్పాటు చేశానని, ప్రభుత్వం తరుపున తాను ఇక్కడి నివాసులకు స్థలాలు ఇప్పించి, పట్టా దారుల నుండి ఖాళీ చేసిన ప్రతి నివాస గృహానికి దాదాపు రెండు లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందే ఏర్పాట్లు చేయమని కోరానని, ఆర్డీవో, ఎమ్మార్వో లతో సంప్రదించి ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు అందరికి ఒకే చోట ఇప్పించనున్నట్లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హై కోర్ట్ ఉత్తర్వులను గౌరవిస్తూ, పట్టాదారుల ఆస్తిని వారికి ఇప్పించి, పేదవారిని సంరక్షించవలసిన బాధ్యత ఎమ్మెల్యే గా తనపై ఉందని హితువు పలికారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు తో పాటు, పలువురు మునిసిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments