బి.సి.జి వ్యాక్సిన్ వేయించుకోండి క్షయ - వ్యాధిని నివారించండి
క్షయ వ్యాధి నివారణ లో భాగంగా నందలూరు మండలం ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం బీసీజీ వ్యాక్సిన్ పై మండల వైద్యాధికారులు శరత్ కుమార్, కార్తీక్ విశ్వనాద్ లు వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా క్షయ వ్యాధితో ఉన్నవారికి , మరియు 3 సంవత్సరాలుగా క్షయ వ్యాధితో బాధపడే వారికి దగ్గరగా ఉన్న వారికి,60 సంవత్సరాలు పైబడిన వారికి, మధుమేహంతో ఉన్నవారికి, పొగత్రాగడం అలవాటు ఉన్నవారికి, శరీర ద్రవ్యరాశి 18 కంటే తక్కువగా ఉన్నవారికి ఈ బీసీజీ వ్యాక్సిన్ వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
అలాగే 18 సంవత్సరాల లోపల ఉన్నవారు, హెచ్ఐవి మరియు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, గర్భవతులు మద్యపానం అలవాటు ఉన్నవారు మానసిక వ్యాధిగ్రస్తులు కు ఈ బీసీసీ వ్యాసం వేయకూడదని తెలిపారు కనుక మండలంలో ఉన్న ఏఎన్ఎంలో ఇంటింటి సర్వే కి వెళ్లి క్షయ వ్యాధికి పై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్లు వేయాల్సిందిగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం , ఆశ వర్కర్లు, ఎమ్ ఎల్ హెచ్ పి ఓ పాల్గొన్నారు.
Comments