కడప జిల్లా :-
ప్రధానోపాధ్యాయులు జీవి నారాయణ రెడ్డి పై సస్పెన్షన్ వేటు.
వల్లూరు మండలం పెద్దపుత్త జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వి. నారాయణ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం కడప ఆర్జెడి వెంకట కృష్ణారెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు.
సోమవారం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు పెద్ద పుత్త ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి విధులకు గైర్హాజర్ అయిన హెడ్ మాస్టర్ నారాయణరెడ్డి పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అతనిపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు . పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 102 నుంచి 64 కు పడిపోవడానికి ఇతడు సక్రమంగా పాఠశాలకు రాకపోవడమే కారణమన్నారు. ఆగస్టు నుండి డిసెంబర్ వరకు పాఠశాల పని దినాలు 90 రోజులు ఉండగా 53 రోజులపాటు OD లపై, ప్రత్యేక సెలవు తీసుకొని పాఠశాల కు వెళ్లకుండా గైర్హాజరయ్యారు. అతనిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఫలితంగా ప్రధానోపాధ్యాయులు జీవి నారాయణ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. ఈయన ప్రధానోపాధ్యాయ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Comments