వనభోజనం గొప్పపవిత్ర కార్యక్రమం.
తాసిల్దార్ శిరీష.
ప్రకృతిని ఆరాధిస్తూ భగవంతుని స్మరిస్తూ అందరూ కలిసి ఓచోట భోజనం చేయడం, ఐక్యతను చాటిచెప్పుతూ వనభోజనం ను నిర్వహించడం ఓ గొప్ప పవిత్ర కార్యక్రమం అని చిట్వేలి తాసిల్దార్ శిరీష అన్నారు.సోమవారం
కార్తీక మాసం సంతరించుకుని మండల పరిధిలోని నెల్లూరు ప్రధాన రహదారి తిమ్మాయపాలెం క్రాస్ శ్రీ దత్తగిరి నారాయణ తపోవనం నందు నిర్వహించిన వనభోజన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. పురాతన సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని తాసిల్దార్ శిరీష అన్నారు.
రామచంద్రస్వామి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, హరే రామ భజనలు నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
రాజుకుంట గ్రామ నివాసి మస్తాననయ్య కుమారుడు మాదినేని కనకరాజు ఉదయం, మధ్యాహ్నం 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఆశ్రమ నిర్మితురాలు నారాయణమ్మ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పలువురు నిరాశ్రయ వృద్ధులకు వసతిని కల్పిస్తూ బాధ్యతలను కొనసాగిస్తున్న నాగేశ్వరమ్మ ను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాదినేని నారాయణ, కూనపల్లి శివరామకృష్ణ, వీఆర్వో భాస్కర్, లింగం లక్ష్మకర్, సిఆర్పి చంద్ర, గిరిబాబు రాజు, వెంకటరమణ రాజు, చంగల్ రాజు, బి కొత్తపల్లి ఎం.రాచపల్లి, చెర్లోపల్లి, తిమ్మాయపాలెం, రాజుకుంట మరియు మండల పరిధిలోని భక్తులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Comments