హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేస్తే నిరసనలా - వరద
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వివేకా కేసులో సీబీఐ విచారణ తరువాత హత్యలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి సంబంధం ఉందని భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని, జిల్లాలో ఉన్న వైయస్సార్సీపి నాయకులు ధర్నాలు, నిరసనలు ఎందుకు చేస్తూన్నారు అని ఆయన ప్రశ్నించారు. ఒక హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేస్తే నిరసనలు చేస్తున్నారా అంటూ విమర్శించారు. సుదీర్ఘ సీబీఐ విచారణ తరువాత గూగుల్ టెకౌట్ వంటి సాక్షాదారాలు వలన అరెస్ట్ చెసారు. అధికారంలో ఉంటే హత్య చేసిన అరెస్ట్ చేయకూడదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పై నమ్మకం లేకనే సునీత కేసు విచారణను పక్క రాష్ట్రానికి సిఫారసు చేసిందని, వివేకా మరణం తరువాత గుండెపోటు అని చెప్పారు.. తరవాత రక్తం మరకలు, సాక్ష్యాలు చేరిపేసి మాఫీ చేయాలనుకున్నారు. న్యాయమైన విచారణ చేసిన సిబిఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments