చిట్వేలి గ్రామం - శివ పట్టణం కావాలని కోరిన ప్రముఖులు.
చిట్వేలు మండల పరిధిలోని పాత చిట్వేల్ నందు మట్టి రాజుల కాలం లో నిర్మితమైన అతిపురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారి దేవస్థానంలో... ఉగాది పండగ సందర్భంగా ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకము, వైష్ణవ ఆగం ప్రకారం విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనము, శత్రు స్థానం అర్చన, పంచాంగ శ్రవణము, నైవేద్యము మంగళ హారతి, మంత్రపుష్పము బలిహరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
తదుపరి ఆలయ అర్చకులు సతీష్ శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో చిట్వేలు గ్రామ ఉప సర్పంచ్ ఉమా మహేశ్వర్ రెడ్డి, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి వెంకటరమణ, స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు, చౌడవరం మురళి, సమ్మెట వీరాంజనేయ రాజు,అన్నయ్య తదితరులు పాల్గొని "చిట్వేలి గ్రామం-- శివ పట్టణం" కావాలని కోరుతూ పోస్టర్ను విడుదల చేశారు. సదరు గ్రామ యువకులు తోట సునీల్, ఆర్కాట్ ముని బాబు,చెంజి అజిత్ తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్యులుగా వ్యవహరించారు. తదుపరి చిన్నయ్య దాసు చే నిర్వహించిన చెక్క భజన ఎంతగానో అలరించింది.
Comments