వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు
శుక్రవారం ఉదయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు పై, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ప్రొద్దుటూరు మున్సిపల్ నాల్గవ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, నియోజకవర్గంలో దాదాపు 2300 పెన్షన్ దారులకు నోటీసులు అందగా, శనివారం నాటికి దాదాపు 2000 పెన్షన్లు తిరిగి పునరుద్ధరించబడతాయని, ప్రతి సంవత్సరం పెన్షన్ దారుల వెరిఫికేషన్ లో భాగంగానే నోటీసులు సచివాలయ సిబ్బంది అందజేశారని, అంతమాత్రాన సచివాలయ వ్యవస్థను విమర్శించడం సబబు కాదని ఆయన హితవు పలికారు.
నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరువైపు ప్రతి ఒక్కరి సమస్యలు అడిగి తెలుసుకుని వెనువంటేనే పరిష్కార దిశగా అడుగులు వేసిన కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే రాచమల్లుకు గడప గడప కార్యక్రమంలో రెండవ స్థానం దక్కిందని, అందుకు తాము సంతోషిస్తున్నామని అన్నారు. తమ ఎమ్మెల్యే రాచమల్లు ఓటమి ఎరుగని నాయకుడని, సొంత నిధులతో కష్టాలలో ఉన్న ప్రజలకు చేయూతనందించే సేవా కార్యక్రమాలను నిర్వహించారని, ఎమ్మెల్యే రాచమల్లు ను విమర్శించే స్థాయి టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ రెడ్డికి లేదని, రాబోవు ఎన్నికల్లో ప్రజలు తిరిగి రాచమల్లును తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవస్థను కించపరుస్తూ ప్రవీణ్ రెడ్డి మాట్లాడిన మాటలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments