ప్రతిపక్షాలు ప్రజలకు ఏ మేలు చేశాయి - వరికూటి
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
బుధవారం ఉదయం నాలుగవ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి వై.ఎం.ఆర్ కాలనీలోని తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నాడు నియోజకవర్గ టీడీపి ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన ఫోన్ కాల్ ఆడియో సంభాషణపై వివరణ అటుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నాలుగవ వార్డు, నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేసారు. అటుపై ప్రవీణ్ రెడ్డి విడుదల చేసిన ఆడియోలో ప్రజలు వాస్తవాలు గ్రహించాలని, నాడు పదహారు మంది ఎక్సిబిషన్ టెండర్లో పాల్గొనగా, బలరాం ఒకకోటి నబ్య రెండు లక్షలకు ఎక్సిబిషన్ దక్కించుకున్నారని, తాము తమ వైసీపీ పార్టీ నాయకులు వ్యాపారం చేసే ధోరణి ప్రదర్శించి ఉంటే అత్యధిక వేలం నిర్వహించే వారమే కాదని, మున్సిపాలిటీ నష్టపోకూడదు అనే సద్దుదేశం తోనే తాము మిన్నకుండిపోయినట్లు తెలిపారు.
కాగా టెండర్ ద్వారా అత్యధికంగా నేటి సంవత్సరం ఎక్సిబిషన్ దక్కించుకున్న నిర్వాహకులు, ప్రజలపై టికెట్ రూపేణా భారం మోపుతారని గ్రహించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రవేశ రుసుము ప్రజలపై భారం కాకూడదు అనే సదుద్దేశంతో నిర్వాహకులతో చేర్చించి ఉచిత ప్రవేశాన్ని కల్పించి, ఆ భారాన్ని తనపై వేసుకున్నారని, ఇందులో ఎక్కడా కూడా ఎమ్మెల్యే అవినీతికి పాల్పడలేదని వెల్లడించారు. తమ ఎమ్మెల్యే రాచమల్లు గడప గడప కార్యక్రమంలో ఎన్నో దాన ధర్మాలు చేస్తుండగా ఇది గిట్టని ప్రతిపక్ష పార్టీలు తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ద్రుష్టి సారించి, సమస్యలపై అవగాహనతో ప్రజల మెప్పు పొందాలని, తద్వారా ఏనాటికో ఒకనాటికి ప్రతిపక్షాలు కూడా పదవి దక్కించుకునే అవకాశం లేకపోలేదు అని హితువు పలికారు.
అనంతరం వైసీపీ సీనియర్ నాయకుడు కాకర్ల నాగశేషా రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రజలకు చేసిన మేలు ఏమిటో వివరించాలన్నారు, తమ ఎమ్మెల్యే దానశీలి అని కొనియాడారు, ఎక్సిబిషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రవీణ్ రెడ్డి కోల్పోయారని, ప్రవేశ రుసుము పెంచిన యెడల ప్రజలపై పెనుభారం పడుతుంది అనే సదుద్దేశంతోనే ఎమ్మెల్యే ఉచిత ప్రవేశం కల్పించారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పగిడాల దస్తగిరి, రాయపురెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments