విద్యార్థులా... వేతన కూలీలా...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఏ ఒక్క పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థినీ విద్యార్థులు చదువులకు దూరం కాకూడదని, వారి ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాల ద్వారా అమ్మ ఒడి, విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద లాంటి కార్యక్రమాలు చేపట్టి, ప్రభుత్వ పాఠశాలలలో చేరికలు, ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా అడుగులు వేస్తూ ఉంటే, ఇందుకు విరుద్ధంగా కొందరు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్న విద్యార్థులచే పాఠశాలలో పనులు చేయిస్తూ ఉన్నారు. తాజాగా శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు వసంతపేట ఉన్నత పాఠశాల నందు ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
ఉపాధ్యాయులు పాఠాలు బోధించే సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల చేత మెటీరియల్ బాక్సులను మోపించాడు. వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు వసంతపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠాలు బోధించే సమయంలో తరగతి గదిలో నుండి విద్యార్థులను పిలిచి వారిచేత పనులు చేయించారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఉపాధ్యాయులే ఈ విధంగా పని చేయించడం దారుణం. పాఠశాలకు వచ్చిన మెటీరియల్ బాక్సులను ఆటోలో నుండి పాఠశాల లోపలి గదిలోకి విద్యార్థుల చేత మోపించి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను బాల కార్మికులనుగా మార్చాడు. విద్యార్థుల చేత ఎలాంటి పనులు చేయించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి ఈ ఘాతకానికి పాల్పటాడు ప్రొద్దుటూరు వసంతపేట స్కూల్ హెడ్మాస్టర్. మరోవైపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుండడంతో ఇలాంటి సంఘటన జరగడం దారుణం.
Comments