వసతి దీవెన అమౌంట్ అవకతవకలు. రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ (RSA) డిమాండ్...
స్థానిక జమ్మలమడుగు పట్టణంలోని రెవెన్యూ డివిజన్ అఫీస్ (RDO) కార్యాలయంలో (RDO) శ్రీనివాసులు కి రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జగన్ వినతి పత్రం ఇచ్చారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి దీవెన విద్యార్థులకు ఇప్పటికీ పడకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని వారు అన్నారు, 2020-2021 సంబంధించి రెండో విడత అమౌంట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయకుండ 2021-2022 సంబంధించి మూడో విడత వసతి దీవెన వేయడం ప్రభుత్వం విద్యార్థులను చుదువుకు దూరం చేసినట్లేనని వారు విమర్శించారు.
ఈనెల 8 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాలలో వసతి దీవెన అమౌంట్ రిలీజ్ చేయడం జరిగిందని, 17 రోజులు గడుస్తున్నా చాల మందికి డబ్బులు పడకపోవడం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వారు తెలియజేశారు, కొంత మంది విద్యార్థులకు అమౌంట్ పడిన చాల తక్కువగా 8200, 7500, 6000, పడడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారిందని వారన్నారు, పేదరికం చదువులకు అడ్డం రాకూడదనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి ఏర్పాటు చేసినాము అన్న ప్రభుత్వం అమౌంట్ వేయడం లో అవకతవకలు ఎందుకని వారు డిమాండ్ చేశారు, విద్యార్థులు చాలా మంది ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు అని వసతి దీవెన అమౌంటు వస్తే హాస్టల్ యాజమాన్యాలకు కట్టాలి అనుకుంటే ప్రభుత్వం సరైన టైమ్ కు వసతి దీవెన అమౌంట్ వేయకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తున్నారు అని అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత వసతి దీవెన పూర్తి అమౌంట్ తల్లుల ఖాతాల్లో వెయ్యాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ జమ్మలమడుగు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, లింగమయ్య, వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments