వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం సాయంత్రం స్థానిక గాంధీరోడ్డు లోని తల్లమ్ సాయి రెసిడెన్సీ నందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యస్థాపక అధ్యక్షుడు కల్వకుంట చంద్రసేన గుప్తా జన్మదినం సందర్భంగా, వాసవి క్లబ్ ప్రొద్దుటూరు శాఖ వారు కార్యక్రమంలో భాగంగా సమాజం పట్ల గౌరవం, వృత్తి పట్ల అంకితభావం, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పలువురు ఉపాధ్యాయులను, పాత్రికేయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు సాగళా మల్లికార్జున రావు, మల్లెముల సుబ్బారాయుడు, శైలజా, గుండా పద్మనాభయ్య, రాజా వెంకట వరలక్ష్మి లను శాలువాలతో సన్మానించి వాసవి క్లబ్ మొమెంటో అందచేశారు.
అనంతరం పట్టణంలోని వివిధ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్రికేయులను సన్మానించారు. కరోనా మహమ్మారి విజృభించి ఆకలి కేకలు, మృత్యు ఘోషలు విలయ తాండవం చేస్తున్న వేళ, తాము నమ్ముకున్న జర్నలిజం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయక, పగలనక రాత్రనక, ఎండనక వాననక పట్టణంలోని నలుమూలల నుండి వార్తలను సేకరిస్తూ, వాటిని తమ పత్రికల ద్వారా టెలివిజన్ల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తూ, అటు ప్రభుత్వాన్ని, అధికారులను ఇటు నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తూ కరోనా వారియర్స్ గా పేరు పొందిన సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రభ దినపత్రిక విలేకరి ఎస్. నరసింహులు, సాయంకాలం దినపత్రిక విలేకరి యాలం వెంకటేష్ యాదవ్, విశాలాంధ్ర దినపత్రిక విలేకరి రాజు, ఎలక్ట్రానిక్ మీడియా స్టూడియో ఎన్ విలేకరి కామిశెట్టి రాజేష్ కుమార్ లను ఘనంగా శాలువాలు కప్పి, మొమెంటో అందచేసి సన్మానించారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, తమను గుర్తించిన వాసవి క్లబ్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియచేసారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ, ప్రజలందరూ సమాజం పట్ల గౌరవంగా మెలగాలని, చేసే వృత్తిని గౌరవించి అంకితభావంతో సేవలు అందించాలని, బాధ్యతాయుతంగా చేసే ఏ పనినైనా ప్రజలకు మేలు చేస్తుందని, అలా తాము నడుచుకున్నందునే నేడు సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఇనుమడింపచేశాయని హితువు పలికారు.
కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సుధాకర్ గుప్తా, సెక్రెటరి కామేశ్వర రావు, ట్రెజరర్ శ్రీధర్, వేణు గోపాల్ రావు, వాసవి క్లబ్ మెంబెర్స్, పలువురు ఆర్యవైశ్యులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments