వై.ఎస్.ఆర్ జిల్లా, జమ్మలమడుగు గతంలో ఒక కూరగాయల మార్కెట్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి మున్సిపాలిటీ పరిధిలో అదనంగా రెండవ నూతన కూరగాయల మార్కెట్ ప్రారంభించినట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు, గురువారం పట్టణంలోని తాడిపత్రి రోడ్డు సంజామల మోటు వద్ద నూతన కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు, అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాగలకట్ట, రామి రెడ్డి పల్లి రోడ్డు, మోరగుడి సర్కిల్, నారాపుర దేవాలయం సర్కిల్, ఈ ప్రాంతానికి అందుబాటులో ఉన్న ప్రజలకు సౌకర్యవంతంగా ఈ నూతన మార్కెట్ అందుబాటులోకి తెచ్చారన్నారు.
గత పాలకులు కూరగాయల మార్కెట్ నిర్మాణం చాలా ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగిందని అలా చేస్తే ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అన్నారు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు, రెండవ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది అన్నారు, కూరగాయల మార్కెట్ వద్ద అక్రమ వసూళ్లు చేస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు, ఇది గమనించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వేల్పుల శివమ్మ, మున్సిపల్ చైర్మన్ వెంకట రామిరెడ్డి, వైస్ చైర్మన్ రామ లక్షుమ్మ,పట్టణ అధ్యక్షుడు పో రెడ్డి మహేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ మంగ దొడ్డి సింగరయ్య, కో ఆప్షన్ సభ్యులు గజ్జల లక్ష్మయ్య, ఫాయాజ్, ఉపాధి కౌన్సిల్ సభ్యులు లక్ష్మీ నరసింహులు, కౌన్సిలర్లు ముళ్ళ జానీ,శామీర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శివ గరివి రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గురీవి రెడ్డి, వైసిపి నాయకులు రమణ రెడ్డి,చరిత బిల్డర్స్ చెన్న కేశవ రెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు దుకాణ దారులు పాల్గొన్నారు.
Comments