సంజీవరాయ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాచమల్లు.
ఆలయ నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ కింద 3.55 కోట్ల మంజూరు
అద్భుతంగా ఆలయ పునర్నిర్మానం చేస్తామన్న ఎమ్మెల్యే
రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామంలో వెలసిన సంజీవరాయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శనివారం భూమి పూజ చేసి శిలా పలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ,చరిత్ర ఆధారంగా సాక్షాత్తు సంజీవరాయ స్వామి నడిచిన నేల వెల్లాల పుణ్యక్షేత్రమని, అటువంటి మహానుభావుని ఆలయ పునః నిర్మాణం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.
ఆలయ పునర్నిర్మాణానికి దేవదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తో కలిపి 3.55 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, క్రమిపీ శిథిలావస్థకు చేరుకుంటున్నా ఈ ఆలయం భగవంతుని సంకల్పంతో పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు .ఈ ప్రాంతంలో ఎక్కడ లేనివిధంగా ఆలయ నిర్మాణం జరగబోతుందని, గతంలో ప్రొద్దుటూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సంజీవరాయస్వామి ఆలయం పునర్నిర్మాణం చేయాలని చెప్పడం జరిగిందని, జగనన్న నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని, ఆ మేరకు స్వయంగా తామే ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అంచనాలు సంబంధించిన దస్త్రం ఆమోదం అయ్యేటట్లుగా ప్రయత్నం చేశామన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి అన్ని సక్రమంగా పనులు జరిగాయని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి శ్రీ సంజీవరాయ స్వామి ఆలయ పునఃనిర్మాణం చేసేందుకు మార్గం సుగమం అయిందని, బాలాలయం చేసి వీలైనంత తొందరగా పనులు జరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే రాచమల్లు ధన్యవాదాలు తెలిపారు .అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సతీమణి రమాదేవి సంజీవరాయ స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు .అనంతరం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు మహిళలు వైసిపి నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణమండపంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, జెడ్పిటిసి సభ్యురాలు జి రెడ్డి అంజని కుమారి, ఎంపీపీ సాత్రి సలోమి, వైసీపీ మండల అధ్యక్షులు గుద్దేటి రాజారాంరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ కానాల విజయలక్ష్మి, ఈవో బి..వి. నరసయ్య ,ఆలయ సీనియర్ అసిస్టెంట్ రామ మోహన్, సచివాలయం కన్వీనర్ వెలవలి శేఖర్ రెడ్డి, గోపల్లె సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు కానాల బలరామిరెడ్డి, ముడియం గౌతంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, జ్ఞానానందం చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments