జాతి గర్వించదగ్గ నాయకుడు అంబేద్కర్
ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్
యావత్ జాతి గర్వించదగ్గ మహా నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. విక్టర్ ప్రసాద్ ప్రొద్దుటూరులో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు.మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోస మనోహర్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాల మాదిగలకే కాకుండా ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికీ మంచి ప్రయోజనాలు చేకూర్చిన వ్యక్తి అన్నారు. దేశంలో మానవ సమాజానికి అత్యున్నతమైన ప్రయోజనాలు చేకూర్చిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అన్నారు. దేశంలో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రభుత్వ విద్య,ఉద్యోగాల్లో సమాన హోదా కల్పించిన మహనీయుడన్నారు. మాల, మాదిగలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం హక్కులు ఉపయోగపడతాయన్నారు. బిఆర్ అంబేద్కర్ తన కుటుంబ ప్రయోజనాలకు ఎన్నడూ పనిచేయలేదని, దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసి దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి కృషి చేశారని, అటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం అన్నారు.
అనంతరం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోస మనోహర్ జన్మదిన సందర్భంగా ఆయనను అభినందించారు. గోస మనోహర్ మంచి భావాలు ఉన్న వ్యక్తిని, భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగే గుణాలు ఉన్నాయని పొగిడారు. ఈ సమావేశంలో చింతల దానమ్మ, జిల్లా యూత్ లీడర్ వినోద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ బాబు, ఆదర్శ మాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పద్ధతి డేవిడ్, మండలాధ్యక్షురాలు జీకే జ్యోతి, జిల్లా కార్యదర్శి చింతల రాజేష్, గోస నవీన్, జాతీయ కార్యదర్శి సుదర్శన్ మరియు మాల మహానాడు సభ్యులు దాదాపు 900 మంది పాల్గొన్నారు.
Comments