వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
గత మూడు రోజులుగా వివాదాలకు నెలవైన విజయదుర్గా గోడౌన్ రైతు బాధితులను ప్రొద్దుటూరు ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని పట్టణ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇంటిపైకి ఎమ్మెల్యే రైతులను పురమాయించే ప్రయత్నం చేశారని, అయినా రైతులు తాను మాట్లాడింది సబబే అని గ్రహించారని, అందుకు 115 మంది రైతులకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నానని, సోమవారం నాటికి రైతులకు కోటి రూపాయలు కడతానన్న ఎమ్మెల్యే తన మాట నిలబెట్టుకొని రైతులకు సాయం చేయాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ జయంతి ఆధ్వర్యంలో నేడు వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సమావేశంలో అమ్మలదిన్నె సుధాకర్ మాట్లాడుతూ గోడౌన్ విషయంలో టీడీపీ వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఏ రైతు టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్లబుచ్చుకోలేదని. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ అబద్దాలను నిజాలుగా మీడియా ముందు చెబుతున్నారన్నారు. ఇది పునరావృతం అయితే 5,6,7 వార్డుల ప్రజలు ప్రవీణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పగిడాల దస్తగిరి మాట్లాడుతూ ఏదయినా రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ ఇలా సాక్షాలు లేని ఆరోపణలు చేయటం సబబు కాదని హితువు పలికారు.
ఈ సమావేశంలో MRPS నాయకులు అమ్మలదిన్నె సుధాకర్, కొండయ్య, డీలర్ సుధాకర్ తదితరులుపాల్గొన్నారు.
Comments