వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరునేడు మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం పల్లవోలు లోని CBIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయి రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న YSRCP MEGA JOB MELA కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్తున్న విజయసాయి రెడ్డి మార్గమధ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లె పంచాయతి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి ఆహ్వానం మేరకు విచ్చేశారు, సర్పంచ్ కొనిరెడ్డి, వైసిపి నాయకులు మర్యాదపూర్వకంగా విజయసాయి రెడ్డి ని ఆహ్వానించగా, విజయసాయి రెడ్డి తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ కొనిరెడ్డి హేమచంద్రారెడ్డి తదితరులు వెంటరాగా, విజయసాయి రెడ్డి ని దుస్సాలువాతో సన్మానించారు, వై,.ఎస్.ఆర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి పలు అంశాల పరిశీలన కోరుతూ విజయసాయి రెడ్డి కి వినతి పత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా కొణిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎం.ఎల్.సి ఎన్నికల్లో సర్పంచులను ఓటర్లుగా గుర్తించాలని, సర్పంచులకు వారి కుటుంబానికి సంవత్సరానికి ఒకరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రేక్ దర్శనం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన సర్పంచుల గౌరవ వేతనం మూడు వేల రూపాయల నుండి పెంపుదల చేయాలని, సర్పంచుల పదవీ కాలంలో ఏ కారణము చేతనయిననూ మరణించిన వారికి పది లక్షల రూపాయల ఎక్స్కరేషియా మంజూరు చేయాలని, నిధులు లేని పంచాయతీలో పారిశుధ్య కార్మికులను నియమించుకొనుటకు ప్రభుత్వం తమ వంతు సాయం అందించాలని కొనిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పులివెందుల లింగాల మండలం పెద్ద గూడాల సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి, కొత్తపల్లె పంచాయతీ సెక్రెటరీ పుల్లారెడ్డి, రవి, 19వ వార్డ్ ముంబర్ తిరుపాల్ రెడ్డి, జింక రమణమూర్తి, కింగ్ భాష, నంగునూరుపల్లె నాగేష్, దూల నరసింహారెడ్డి, కొనిరెడ్డి సుబ్బారెడ్డి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్, కొత్తపల్లె పంచాయతి వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments