కడప జిల్లా, ప్రొద్దుటూరు హోమస్ పేట కన్వ మార్ట్ పక్క సందులో ఉన్న వి.కే హోమియోపతి క్లినిక్ హీలింగ్ హెల్త్ హైవ్ నందు డా।। విక్రాంత్ తేజ ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు హోమియో పట్ల సరయిన అవగాహన లేదని, ఎంతటి దీర్ఘకాలిక వ్యాధినయినా హోమియో ద్వారా నయం చేయవచ్చునని, హోమియో వైద్యం ద్వారా సైనసైటిస్ గల వారికి ఆపరేషన్ లేకుండానే నివారణ చేయగలమని, ఇప్పుడు హోమియో అత్యాధునిక పద్దతుల ద్వారా అన్ని రకాల వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపగలమని, పిల్లలలో సాధారణంగా వచ్చే డయేరియా, వాంతులు, పాలు అరగకపోవటం వంటి వాటికి పరిష్కారం హోమియోలో కలదని, గర్భం దాల్చిన మహిళలు హోమియో మందులు వాడటం ద్వారా ఉమ్మ నీరు తగ్గుట ఇతర సమస్యలు లేకుండా సుఖ ప్రసవం జరిగేందుకు దోహద పడతాయని, ఇంగ్లీష్ మందులు తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే అని, అదే హోమియో ద్వారా వ్యాధి నుండి శాశ్వత ఉపశమనం కలుగుతుంది అని ఆయన తెలిపారు. ఈనెల 25, 26వ తేదీలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ హోమియో క్లినిక్ నందు ఆర్మీ, పోలీస్, ఎన్.సి.సి వారికి ఉచితంగా వైద్యం, మందులు పంపిణీ చేశామని తెలిపారు.
బెంగుళూరు లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి హొమియో పట్టా పొందిన డా।। విక్రాంత్ తేజ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు అలాగే సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు హోమస్ పేట లోని తన వి.కే హోమియోపతి క్లినిక్ హీలింగ్ హెల్త్ హైవ్ నందు అందుబాటులో ఉంటానని తెలిపారు.
Comments