భక్తిశ్రద్ధల నడుమ గణేష్ నిమజ్జన వేడుకలు.
-అన్నదాన వితరణ.
-42,000 దేవుని లడ్డు పాట
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం అనుంపల్లి గ్రామం నందు గణేష్ నిమజ్జనం వేడుకలను గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో శాంతి సామరస్యంతో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం కీర్తిశేషులు మాదినేని రామక్రిష్ణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించగా;తదుపరి దేవుని లడ్డు పాట నిర్వహించగా గ్రామస్తులు పోటీపడి 42,000 కు నానబాల రమేష్ బాబు సొంతం చేసుకున్నారు. దేవుని విగ్రహా ఖర్చు, పూజా కార్యక్రమాలు రమేష్ బాబు కుటుంబ సభ్యులు నిర్వహించారు.
తర్వాత సాయంత్రం దేవుని ఊరేగింపు అనంపల్లి గ్రామ పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యువత డప్పుల దరువుకు చిందులు వేసి తమ భక్తిని చాటుకుని ఆనందపరవశులయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు తమ సిబ్బందిని పహారా నియమించారు.
ఈ కార్యక్రమాలన్నింటినీ సదరు గ్రామ పెద్దలు మాదినేని సుధాకర్, మాదినేని కుమార్, గుత్తి సుబ్బరాయుడు, నానబాల శ్రీనివాసులు, పసుపులేటి ఈశ్వరయ్య, గబ్బి శివ, మాదినేని నరసయ్య, మాదినేని నాగరాజా, మరియు యువత బాలకృష్ణ ,మల్లి , మురళి, మహేంద్ర, బాలసుబ్రమణ్యం,తేజ, సుధా తదితరులు సమీక్షించారు.
Comments