గంగమ్మ ఒడికి గణనాథుడు..
--పెద్ద ఎత్తున అన్నదానం..
--అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.
వినాయక చవితి వేడుకల్లో భాగంగా చిట్వేలి మండల వ్యాప్తంగా వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసి మూడు రోజుల నుంచి పది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శింగనమాల వీధిలో శ్రీ కోదండరామ స్వామి దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన భారీ వినాయుకిని విగ్రహం గురువారం సాయంత్రం నిమజ్జనానికి తరలి వెళ్ళింది. ఉత్సవ కమిటీ పెద్దలు,యువత వాహనానికి వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణలు గావించారు.
బుధవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, దేవుని లడ్డు పాట నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమం లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తారాజువ్వలు (బాణాసంచా)ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు, యువత, మహిళలు వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం గావించారు. గణనాధుని గంగమ్మ ఓడికి సాగనంపారు. స్థానిక పోలీస్ శాఖ పటిష్ట భద్రత చర్యలు చేపట్టింది.
Comments