విశాఖపట్నం పూర్ణ మార్కెట్ కూడలి దగ్గర చెత్త పన్ను నిమిత్తం ట్రేడ్ లైసెన్స్ నిమిత్తం సచివాలయం సిబ్బంది జివిఎంసి సిబ్బంది అడిగినా పట్టించుకోని వ్యాపారస్తులను, ఈరోజు జోనల్ కమిషనర్-4 బీ.రమణ నేతృత్వంలో సిబ్బందితో కలిసి వ్యాపారస్తుల అడగడానికి వెళ్లడం జరిగినది. విశాఖ ప్లాస్టిక్ డిపార్ట్మెంట్ స్టోర్ వ్యాపారస్తుడు చెత్త పన్ను నిమిత్తం అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా కట్టలేదని అడగడంతో సిబ్బంది మీద అలాగే జోనల్ కమిషనర్ మీద చెయ్యి చేసుకోవడం జరిగింది.
ఎన్ని విధాలుగా టాక్స్ కడుతున్నప్పటికీ కొత్తగా చెత్తకు పన్ను సరికాదని గతంలో కూడా సిబ్బంది చెప్పినా పట్టించుకోకుండా వ్యవహరించడంతో కోపోద్రిక్తుడై చెయ్యి చేసుకున్నానని తెలిపారు. అలాగే అతని మీద సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా సచివాలయం సిబ్బంది మీద కూడా వాలంటరీ మీద కూడా ప్రజలు దురుసుగా ప్రవర్తించడం జరుగుతున్నది అయినప్పటికీ ప్రజలు అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం దగ్గర లేదని తెలియడం జరుగుతుంది కారణం ఏమిటంటే అన్ని రకాల టాక్స్ లు ఇంక్లూడింగ్ కలిపి సంవత్సరానికి రెండు విడతల కడుతున్నామని ఈ కొత్తగా చెత్త పన్నులు ఏంటి అని ప్రజల ఆవేదన తెలియజేస్తున్నారు. నెలసరి 120 రూపాయలు గృహానికి కట్టమని అలాగే కమర్షియల్ వారి వ్యాపార నిమిత్తము సిటీ లో కొంత పల్లెటూరు లో కొంత కట్టమని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన ప్రజలు వాపోతున్నారు
Comments