విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం - విశాఖ
ఉక్కునగరం, ప్రసన్న ఆంధ్ర
విశాఖ స్టీల్ ప్లాంట్ లో విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం
స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయుల, విద్యార్థులు గేటు వద్ద బైఠాయిపు.
2500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య.
స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటున్న తల్లిదండ్రులు.
ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడాలంటున్న తల్లిదండ్రులు
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని గురువారం ఉదయం తెరువకపోవడంతో పాఠశాలకు బయలుదేరిన విద్యార్థినీ విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ పాఠశాలలు దాదాపు 2500 మంది విద్యను అభ్యసిస్తుండగా, ప్రస్తుతం వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభం అయిన నేపథ్యంలో ఇక్కడి పాఠశాల తెరువకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గేటు వెలుపల ఆందోళన చేపట్టారు.
Comments