ప్రజలే నేరుగా లబ్ధి పొందే పథకం విశ్వకర్మ పథకం -- బిజెపి జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి
ప్రజలే నేరుగా లబ్ధి పొందే పథకం విశ్వకర్మ పథకం అని
జిల్లా బిజెపి అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి తెలిపారు. శనివారం ప్రొద్దుటూరు బిజెపి నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక బిజెపి కార్యాలయంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళల ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలో మహిళల ఆర్థిక అభివృద్ధి స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం యొక్క ప్రయోజనాలను మహిళలకు తెలిపారు. ఎవరి ప్రమేయం లేకుండా ప్రజలే నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ పథకం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని గుర్తించామన్నారు.
తాము దరఖాస్తు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ, వాలంటీర్లు కానీ ప్రలోపడితే నమ్మి మోసపోవద్దని తెలిపారు. దరఖాస్తు పరిశీలన అనంతరం ఉచిత శిక్షణతో పాటు శిక్షణకాలంలో 500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారన్నారు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుందని మహిళలు వివిధ వృత్తుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. మొదటి విడత ఒక లక్ష రూపాయలు రెండవ విడత రెండు లక్షలు మంజూరు చేస్తారన్నారు. అంతే కాకుండా 15 వేల రూపాయల విలువగల టూల్ కిట్ ఉచితంగా అందిస్తారని వివరించారు. బిజెపి కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ స్టవ్ తో పాటు కనెక్షన్ మంజూరు చేస్తారన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, బిజెపి రాష్ట్ర మహిళా నేతల వివి విజయలక్ష్మి, బిజెపి పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్రరావు, జిల్లా కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం, బిజెపి నాయకులు శరత్ బాబు, వద్ది సుబ్బయ్య, మహిళా మోర్చా సుప్రజా, తదితరులు పాల్గొన్నారు.
Comments