గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా కోసం, కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గాజువాక జోన్ - 6, GVMC పరిధిలో పనిచేస్తున్న మునిసిపల్ పర్మినెంటు కార్మికులు అలాగే కాంట్రాక్టు కార్మికులు రేపు 19-01-2022 ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నాకు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని, జీవీఎంసీ (పర్మినెంటు) మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్, జీవీఎంసీ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు (అనుబంధ సంస్థ) పిలుపునిచ్చింది.
పర్మినెంట్ ఉద్యోగులకు, మూడు సున్నాల పీఆర్సీని ప్రతిఘటించాలని, మిశ్రా కమిషన్ రిపోర్టును బహిర్గతపర్చాలని, సి.పి.ఎస్ రద్దు చేసి, ఓ.పి.ఎస్ అమలు ప్రకటించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు పి ఆర్ సి ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు, పర్మినెంటు, 60 + డెత్ లేదా సిక్కు అయినా కార్మికుల పోస్టులలొ కార్మికుల బిడ్డల ఉపాధి, తదితర డిమాండ్ల సాధనకై రేపు అనగా 19 తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు జి.సుబ్బారావు, గొలగాని అప్పారావు,నాగరాజు, గణేష్ రాము, తదితరులు.
Comments