స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి,
దేశంలో 8 రాష్ట్రాల్లో స్టీల్ కార్మికులకు అమలు అవుతున్న నూతన వేతనాలను విశాఖ ఉక్కు కర్మాగారం లో కార్మికులకు అమలు చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టి టి ఐ కూడలి వద్ద ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జె అయోధ్య రామ్, మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో స్టీల్ యాజమాన్యం కార్మికుల ఆర్థిక ప్రయోజనాలపై నిరంకుశ వైఖరిని ప్రదర్శిసిస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు. దీనిని 100% వ్యూహాత్మక అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా 365 రోజులుగా జరుగుతున్న ఐక్య ఉద్యమాలను భగ్నం చేయాలన్న ప్రభుత్వ యాజమాన్యాల వైఖరి ఐక్య ఉద్యమాలతోనే తిప్పికొడతామని వారు హెచ్చరించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 30 వేల కోట్ల టర్నోవర్ సాధించే దిశగా కార్మికవర్గం కృషిచేస్తోందని వారు వివరించారు. దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఐదు వేల కోట్ల రూపాయలు జి ఎస్ టి రూపంలో చెల్లిస్తామని వారన్నారు. అలాగే వెయ్యి కోట్ల రూపాయల వరకు లాభాలు ఆర్జించే పరిస్థితులు వస్తాయని వారు అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ కర్మాగారాన్ని తన తాబేదార్లకు కట్టబెట్టే ఆలోచనలోనే కేంద్రం పావులు కదుపుతోంది దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవని వారు స్పష్టంచేశారు. ఈ విషయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి కోటి సంతకాలు సేకరించే ప్రణాళికలు రూపొందించుకున్నామని వారన్నారు. కర్మాగార రక్షణతో పాటు కార్మిక హక్క అయిన నూతన వేతనాలు అమలు చేయడంలో యాజమాన్య జాప్యానికి వ్యతిరేకంగా ఈ నెల 31 సమ్మెతో ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.
ఈ ధర్నాలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు గంధం వెంకట్రావు, బి.అప్పారావు, డి.వి.రమణ యు.రామస్వామి, కె. సత్యనారాయణ రావు, వై మస్తానప్ప, దొమ్మేటి అప్పారావు, రాధాకృష్ణ, వరసాల శ్రీనివాస్, వి. రామ మోహన్ కుమార్, కరణం సత్యారావు, సిహెచ్ సన్యాసిరావు, డి.సురేష్ బాబు, జి ఆర్ కె నాయుడు, టి.జగదీష్, పరంధామయ్య, డేవిడ్, నమ్మి సింహాద్రి తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Comments