విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని కోరుతూ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ యాజమాన్యం ఒంటెద్దు పోకడలకు నిరసనగా ఈ నెల 31వ తారీఖున సమ్మెతో ప్రతిఘటిస్తామని అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యం హెచ్చరించాయి. ఈరోజు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ సి.ఎం.డి శ్రీ అతుల్ బట్ గారికి సమావేశ మందిరంలో సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం స్టీల్ సి.ఎం.డి గారి సమక్షంలో వారి సమావేశ మందిరంలో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు జె అయోధ్య రామ్, గంధం వెంకట్రావు, డి ఆదినారాయణ మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు అమలు చేయాలన్న చిత్తశుద్ధితో యాజమాన్యం లేదని వారు తీవ్రంగా విమర్శించారు. వేతనాలకు అదనంగా అయ్యే ఖర్చు కేవలం 15 కోట్లు మాత్రమే అని దానిని సమకూర్చుకో లేని స్థితిలో స్టీల్ యాజమాన్యం ఉందా అని వారు ప్రశ్నించారు. దీని వెనక యాజమాన్య, ప్రభుత్వం నిరంకుశ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని వారు తీవ్రంగా ఆరోపించారు. సమ్మె చేయడం ద్వారా 100 కోట్లు నష్టం అంటున్నా సి.ఎం.డి గారి మదిలో దీనిని అమ్మడం కోసం ఇది ఒక సాకుగా చూపాలని ప్రయత్నించవద్దని వారు హితవు పలికారు. సెయిల్ యాజమాన్యం అమలు చేసిన వేతనాలను ఇక్కడ కూడా అమలు చేయడం గత నుంచి వస్తున్న సాంప్రదాయం అని దీనిని పాటించవలసిన బాధ్యత స్టీల్ యాజమాన్యంపై ఉందని వారు స్పష్టం చేశారు. యాజమాన్యం పునరాలోచించి వేతనాలు అమలు చేస్తే మంచిదని లేకుంటే జనవరి 31 సమ్మెతో ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు.
ఈ సమావేశంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు కె. సత్యనారాయణ రావు, వై మస్తానప్ప, దొమ్మేటి అప్పారావు, కొమ్మినేని శ్రీనివాస్, డి.సురేష్ బాబు, కరణం సత్యారావు, డి వి రమణ రెడ్డి, వి రామ్ మోహన్ కుమార్, సి హెచ్ సన్యాసిరావు, వి రామ్ కుమార్, వరసాల శ్రీనివాస్, టి జగదీష్, బి డేవిడ్, కె పరంధామయ్య తదితరులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments