ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, స్టీల్ కార్మికుల నూతన వేతనాలు అమలు కోసం జనవరి 31న జరిగే సమ్మెను తాత్కాలికముగా వాయిదా వేసుకున్నామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు తెలియజేశారు. ఈరోజు టి టి ఐ కార్యాలయ సమావేశమందిరంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధులు మరియు ఆర్ జె సి ఎల్ సమక్షంలో సమావేశం జరిగింది. ఈ వివరాలను వివరించడానికి కార్మిక సంఘాల ప్రతినిధులు ప్లాంట్ లోని LMMM పార్కులో జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో యాజమాన్య అభ్యర్థనగా ఫిబ్రవరి-3 న అత్యవసర బోర్డు సమావేశంలో కార్మికుల నూతన వేతనాలు అమలు కోసం అనుమతి తీసుకుంటామని యాజమాన్య ప్రతినిధులు ప్రవేశపెట్టరు. దీనిని ఆర్ జె సి ఎల్ శ్రీ మహంతి కార్మిక సంఘాల ప్రతినిధులకు వివరించారు. ప్రతినిధులు మాట్లాడుతూ యాజమాన్యం మాట తప్పితే ఏరోజైనా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికి యాజమాన్యం అంగీకరిస్తే ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటామని వారు స్పష్టం చేశారు. దీనికి అంగీకరిస్తూ యాజమాన్యం ఆర్ జె సి ఎల్ మహంతి కి అంగీకార పత్రాన్ని అందించారు.
ఆర్ జె సి ఎల్ మహంతి మాట్లాడుతూ యాజమాన్య అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న కార్మిక సంఘాలను అభినందించారు. మంచి వాతావరణంలో జరిగిన చర్చలను యాజమాన్యం కూడా అంగీకరించడం శుభ పరిణామమని ఆయన అన్నారు. దీనిని కొనసాగిస్తూ యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.
పై విషయాలను విస్తృత కార్యకర్తల సమావేశంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు వివరించారు.
ఈ సమావేశంలో యాజమాన్య ప్రతినిధులుగా బినయ్ ప్రసాద్, కె.సంజీవ రావు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జె అయోధ్య రామ్, వైటి దాస్, యు రామస్వామి, గంధం వెంకట్రావు, నీరుకొండ రామచంద్ర రావు, డి. ఆదినారాయణ, డి వి రమణ కె. సత్యనారాయణ రావు, గణపతి రెడ్డి, రాధాకృష్ణ, వరసాల శ్రీనివాస్, సిహెచ్ సన్యాసిరావు, డి. సురేష్ బాబు, దాలి నాయుడు, ఉగ్రం, కరణం సత్యారావు, జి ఆర్ కె నాయుడు, డేవిడ్, టి జగదీష్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
コメント