గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాల మరియు వైయస్సార్ పార్టీ బంద్ పిలుపుమేరకు ఈ రోజు ఉదయం 8 గంటలకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో గాజువాక వైఎస్సార్సీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పర్యవేక్షణ లో పాతగాజువాక కూడలిలో గాజువాక ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాల మరియు వైయస్సార్ పార్టీ బంద్ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం 8 గంటలకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో గాజువాక వైఎస్సార్సీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పర్యవేక్షణ లో పాతగాజువాక కూడలిలో గాజువాక ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విశాఖ ఉక్కు ఉద్యమానికి పూర్తి సహకారం అందించారు అలాగే మన రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పార్లమెంట్లో లో పోరాటం చేస్తున్నారని అలాగే విశాఖ ఉక్కు విషయంలో వైయస్సార్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదని అని ఎమ్మెల్యే గారు అన్నారు అనంతరం గాజువాకలో బంద్ లో పాల్గొని సామూహిక మానవహారం మరియు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి 79 వార్డు ఇంచార్జ్ అప్పికొండ మహాలక్ష్మి నాయుడు , గాజువాక మహిళా అధ్యక్షురాలు రోజా రాణి , ఎస్సీ సెల్ అధ్యక్షులు పరదేశి వార్డు కార్పొరేటర్లు ధర్మాల శ్రీనివాసరావు ,కేబుల్ మూర్తి ,ఇమ్రాన్ ఖాన్ వైయస్సార్ సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
תגובות