top of page
Writer's picturePRASANNA ANDHRA

ప్రభుత్వ రంగ సంస్థల్లో కొనసాగే విధంగా కలిసి రండి

విశాఖపట్నం ప్రసన్నా ఆంధ్ర వార్త


ప్రభుత్వ రంగ సంస్థల్లో కొనసాగే విధంగా కలిసి రండి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష అధికార పార్టీలను కలిసిన పోరాట కమిటీ సభ్యులు .తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోరాట కమిటీ సభ్యులు మెమరీడం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు ఇతర తెలుగుదేశం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగే విధంగా కేంద్రం పైన ఒత్తిడితస్తామని అలాగే స్టీల్ ప్లాంట్ గురించి నా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నమాట వినిపించగానే ఆంధ్రుల హక్కును కోల్పోతున్న విశాఖ అని బాధ కలిగిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా చిదిగిన ప్రభుత్వం రంగ సంస్థ ,సొంత గనులు ఇవ్వకపోయినా స్వశక్తితో స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క శక్తితో నష్టాలలో నుంచి లాభాలకు తెచ్చే విధంగా అని కొనియాడారు. నరేంద్ర మోడీ వచ్చే సందర్భంలో ఈ విషయం మీద మా పార్టీ యొక్క నారా చంద్రబాబునాయుడు అలాగే మా పార్టీ శ్రేణులు ఈ విషయం మీద నరేంద్ర మోడీ కి విన్నవించడం జరుగుతాదని మరీ గట్టిగా ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగే విధంగా ప్రయత్నాలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.


ఇదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎం.పీ ఎం వి విసత్యనారాయణ కూడా కలిసిన స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు మెమరీడం ఇవ్వడం జరిగినది .ఈ సందర్భంగా సత్యనారాయణ గారు మాట్లాడుతూ విశాఖకు స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయ . మన విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ వాసులకు చాలా అదృష్టం అన్నారు. కానీ 632 రోజుల క్రితం ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ అన్న విషయం మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది దాన్ని ప్రైవేటీకరణ చేయడం మంచిదని చిలక పలుకులలో చెప్పిన విధానాన్ని గుర్తుకొచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం జరిగిందని. ఆ తీర్మానం తో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగే విధంగా స్టీల్ ప్లాంట్ ను ఉంచాలని లిఖితపూర్వకంగా పంపడం జరిగినది. విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగే విధంగా ఉంచుతామని వారికి మా ప్రభుత్వం తరఫున వెన్నవిస్తామని స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీకి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు ఆదినారాయణ , అయోధ్యరామయ్య, డివి రమణ, దొమ్మేటి అప్పారావు, పిట్టా రెడ్డి పోరాట కమిటీ సభ్యులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది .

5 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page