స్టీల్ ప్లాంట్ గడ్డు కాలం ఎదుర్కొంటుందని తక్షణం దీని నివారించే విధంగా చర్యలు చేపట్టాలి
గాజువాక, ప్రసన్న ఆంధ్ర
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటుందని దీని నివారించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని స్టీల్ ప్లాంట్ సిఐటియు యూనియన్ వారి కార్యాలయంలో కలిసి స్టీల్ ప్లాంట్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న గనులను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు గతంలో కేటాయించారని వాటిని గత ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా ఆపిందని వాటిని తక్షణం రెన్యువల్ చేయాలని ఆయన కోరారు. స్టీల్ ప్లాంట్ సీనియర్ నాయకులు ఎన్ రామారావు మాట్లాడుతూ గతంలో స్థానిక యాజమాన్యం ఈ ప్లాంట్ వృద్ధి కోసం కృషి చేసే వారిని నేటి యాజమాన్యం దానికి విరుద్ధంగా నడుస్తోందని దీనిపై కేంద్రమంత్రి గారికి వివరించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ ఈ ప్లాంట్ మనుగడు సాగించాలంటే తక్షణసాయంగా వర్కింగ్ క్యాపిటల్ ని అందిస్తూ, పూర్తిస్థాయి ఉత్పత్తి చేయడానికి అవసరమైన రా మెటీరియల్ ను అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అభ్యర్థించారు. దీనిపై స్పందించిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గనులు కేటాయింపులో గత ప్రభుత్వం అనుసరించిన విధానానికి విరుద్ధంగా గనుల రెన్యువల్ చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నేను ప్రధానంగా మీ అందరి మద్దతుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించడం జరిగిందని కనుక ఈ సమస్యను పరిష్కరించే అంతవరకు నా ప్రయత్నాలను కొనసాగిస్తూ దీనిని కాపాడుకోవడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, కె గంగాధర్, నీలకంఠం, మరిడయ్య, కృష్ణమూర్తి, మహేష్, వి ప్రసాద్, రాజా, అప్పలరాజు, పవన్, ఒప్పంద కార్మిక సంఘాల ప్రతినిధులు జి శ్రీనివాస్, నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు.
تعليقات