ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, పెదగంట్యాడ, 76 వ వార్డు రామచంద్ర నగర్ గ్రామంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గాజువాక జోన్ కార్యదర్శి D.రమణ పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చేయడానికి సంవత్సర కాలం నుండి ప్రయత్నం చేస్తోందన్నారు కానీ విశాఖ కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండి ఎంతవరకు కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరు రాకుండా అడ్డుకోవడం జరిగింది అన్నారు . 32 మంది ప్రాణ త్యాగాలు చేసి వచ్చిన స్టీల్ ప్లాంట్ ను ఈరోజు మన కార్మికవర్గం అంతా కూడా కాపాడుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు . స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థ లో ఉంది కాబట్టే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులకు గాని ఇతర కార్మిక వర్గానికి అందరికీ పని దొరుకుతుంది అంటే అది స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టే కావున స్టీల్ ప్లాంట్ ను మనమందరము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘం పిలుపునిచ్చింది కావున మన గ్రామంలో ఉన్న అందరూ మరియు కార్మికవర్గం అందర్నీ ఈ కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమంలో మమేకం చేసి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అర్జున్, రాజారావు, రామ్మూర్తి కార్మికులు పాల్గొన్నారు.
Comments