ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన అఖిలపక్ష కార్మిక సంఘాలు సీ ఎం డి కి వినతి పత్రం ఇవ్వనున్న కార్మిక సంఘాలు.
LMMM పార్కులో జరిగిన అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ సమస్యలపై చర్చిస్తూ ఉద్యోగ సంఘాల నేతలు సి ఎం డి ని డైరెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని, కార్మిక సోదరులకు అండగా ఉండాలని తద్వారా కాంట్రాక్ట్ కార్మికుల మనోభావాల్ని గౌరవించి విశ్వసనీయతను పొందాలని నిర్ణయించడం జరిగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో కాంట్రాక్ట్ కార్మికులను కూడా భాగస్వామ్యం చేయాలని DVRSCWU నాయకత్వం కోరగా అఖిలపక్ష నాయకులందరూ సమ్మతి తెలిపారు. కార్మికులను టెంట్ వద్ద కూర్చోవడానికి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించడం జరిగింది. ఉద్యోగులకు వేసిన రోస్టర్ నే అనుసరిస్తూ ఆయా డిపార్ట్మెంట్లలో ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొనే విధంగా ఆలోచన చేయడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం.
కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ సమస్యలైన వర్క్ ఫ్రం హోం జీతాలు, ప్రమాదం జరిగినప్పుడు ఈ ఎస్ ఐ హాస్పిటల్ వరకు అంబులెన్స్ సౌకర్యం, పాతిక లక్షల ఎక్స్గ్రేషియా పరిహారం, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు, కాంట్రాక్టర్ మారినా కార్మికుడు మారని విధానం, ఒక DP మరణించినా లేదా పదవీ విరమణ చేసిన ఆ స్థానంలో మరో DP ని మాత్రమే తప్పనిసరిగా నియమించాలని, యాభైశాతం కాకుండా నూటికి నూరుశాతం నిర్వాసితులను మాత్రమే పర్మినెంట్ పనులలోకి తీసుకోవాలని తదితర 15 డిమాండ్లతో మెమోరాండం తయారుచేసి ప్రధాన యూనియన్ల ఉద్యోగ నాయకులు CMD కి మరియు డైరెక్టర్లకు 5వ తేదీన అందజేస్తారు.
Comments