ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ప్లాంట్ లో వివిధ విభాగాల్లో సంతకాల సేకరణ జరిగింది.
ఈ సందర్భంగా పరిరక్షణా పోరాట కమిటీ కన్వీనర్ జె అయోధ్య రామ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కోటి సంతకాలు సేకరించి తమ నిరసనను తెలియజేయాలని ఆయన అభ్యర్థించారు. అనేక మంది నిర్వాసితులు తమ విలువైన భూములను త్యాగం చేయడం ద్వారానే ఈ కర్మాగారం ఎక్కడ ఏర్పడిందని ఆయన వివరించారు. అలాగే 32 మంది ప్రాణత్యాగం, నేటికి 250 మంది తమ ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఈ దశకి వచ్చామని ఆయన వివరించారు. వారి త్యాగాలు అపహాస్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనిని కాపాడుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు గంధం వెంకట్రావు, కె. సత్యనారాయణ రావు, వై మస్తానప్ప, డి వి రమణ రెడ్డి, బి అప్పారావు, పివి రమణ మూర్తి, నాగబాబు, కొయిలాడ శ్రీనివాసరావు తదితరులతోపాటు ఆయా విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Comments