స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, స్టీల్ కార్మికుల నూతన వేతనాలు అమలు నేపథ్యంలో రేపు జరిగే బోర్డు సమావేశానికి విచ్చేసిన ఇండిపెండెంట్ డైరెక్టర్ ని కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ అతిథిగృహంలో ఈరోజు ఉదయం కలిశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ స్టీల్ కార్మికుల వేతనాలు కోసం ఐదు సంవత్సరాల నుంచి వేచి ఉన్నారని వారన్నారు. సెయిల్ కార్మికులకు కొత్త వేతనాలు అమలై రెండు నెలలు అయింది అని కానీ ఇక్కడ యాజమాన్యం అమలు చేయడంలో జాప్యం ప్రదర్శిస్తోందని వారు వివరించారు. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తే ఈ కర్మాగారంలో జరిగే ఉత్పత్తి ఉత్పాదకతను మరింత పెంచడానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.
దీనికి స్పందించిన ఇండిపెండెంట్ డైరెక్టర్లు సమస్యను సానుకూలంగా పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు డాక్టర్ సీతా సినహా, శ్రీ సునీల్ కుమార్ హరినీ, శ్రీ ఘనశ్యామ్ సింగ్ కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు జె అయోధ్య రామ్, గంధం వెంకట్రావు, డి ఆదినారాయణ, గణపతి రెడ్డి, కొమ్మినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments