భావితర ఉద్యోగులకు ఉక్కు కర్మాగార ప్రగతికి సుదీర్ఘ సేవలందించి పదవి విరమణ చేసిన ఉక్కు ఉద్యోగులు ఆదర్శమని స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షులు జె అయోధ్యరామ్
అగనంపూడి పునరావాస కాలనీ కొండయ్యవలస సి ఎస్ ఆర్ గ్రౌండ్లో సిడబ్ల్యుసి ఆధ్వర్యంలో 2020 సంవత్సరం జనవరి నుండి 2021సంవత్సరం డిసెంబర్ వరకు స్టీల్ ప్లాంటు ఉద్యోగ విరమణ చేసిన అగనంపూడి ఏరియా అధికారులకు ,కార్మికులకు 41 మందికి గుర్తింపు యూనియన్ మరియు అఖిలపక్ష నాయకులు చే దుశ్శాలువ, పూలదండ, షీల్డ్ తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది,
జే అయోధ్యరామ్ ప్రసంగిస్తు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇండ్లు, భూములు త్యాగం చేసి 32 మంది ప్రాణ త్యాగాల తో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉక్కు కర్మాగారానికి నవరత్న గుర్తింపు తేవడానికి పదవి విరమణ చేసిన ఉద్యోగులు సేవలు అభినందనీయం అన్నారు.
ఉక్కు గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి వైటి దాస్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసే ఉద్యమంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు భాగస్వాములు అవ్వాలని కోరుతూ ఇప్పటివరకు కర్మాగారానికి చేసిన సేవలను కొనియాడారు.
అగనంపూడి అధ్యక్షులు ఎం. జయరాజు ప్రసంగిస్తూ సిడబ్ల్యూసి కార్యవర్గం ఈ ప్రాంతంలో సి ఎస్ అర్ ద్వారా శిక్షణా తరగతులు, క్రీడలు, ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన సామాగ్రి అందజేయడం జరుగుచున్నది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కూడా సిడబ్ల్యుసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అగనంపూడి సిడబ్ల్యుసి కార్యదర్శి వంకర రాము సభాధ్యక్ష జరిగిన కార్యక్రమంలో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఉక్కు అఖిలపక్ష యూనియన్ నాయకులు ఐ ఎన్ టి యు సి నుండి మరిసా రామచంద్రరావు,ఎఐటియుసి నుండి అలమండ శ్రీనివాసరావు డివిఆర్ యూనియన్ నుండి ధర్మాల వెంకటరమణరెడ్డి టి ఎన్ టి యు సి నుండి మామిడి అప్పారావు వైయస్సార్ నాయకులు దాము రోతు అప్పలరాజ స్థానిక సీఐటీయూ యూనియన్ నాయకులు పెద్దిరెడ్ల నీలకంఠం, ఉప్పల కన్నారావు , ఉరిటి మరిడియి, చిత్త అబ్బాయి, పట్టా రమేష్, సిడబ్ల్యూసి ప్రతినిధులు శీరందాసు శ్రీనివాసరావు,మొలి కోటేశ్వరరావు ,ఎం దయాకర్,కె దుర్గారావు మరియు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కుటుంబ సభ్యులు , గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కోరుకొండ బాబురావు కామెడీ స్కిట్స్ జోక్స్ ఉక్కు నగరం ప్రజా నాట్య మండలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది విశేష స్పందన వచ్చింది.
Comments