స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ ఉక్కు కర్మాగారం లో 16 సంవత్సరాల క్రితం అనగా 10 ఫిబ్రవరి 2006 లో 13325 టన్నుల ఉత్పత్తి చేశారని, అది నేడు అధిగమించి 15 ఫిబ్రవరి 2022 లో 15230 టన్నుల ఉత్పత్తి చేసిన ఉక్కు ఉద్యోగులను, కాంట్రాక్ట్ కార్మికులను గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె అయోధ్య రామ్, వై టి దాస్ అభినందించారు. ఇది సుమారు రెండు వేల టన్నుల అధికంగా ఉత్పత్తి అయిందని. దీనికి కృషి చేసిన కార్మిక వర్గానికి ఇవ్వవలసిన ప్రోత్సాహకాలను ఇవ్వకుండా యాజమాన్యం వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. అలాగే ఆస్ట్రేలియా నుంచి రావాల్సిన కోకింగ్ కోల్ సకాలంలో అందకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యం ఖరీదు చేయలేదని వారు వివరించారు. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్-3 లో ఉత్పత్తి ప్రారంభించకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని వారు తీవ్రంగా విమర్శించారు. కనుక ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు ప్రోత్సాహకాలను అందిస్తూ, బ్లాస్ట్ ఫర్నేస్-3 లో తక్షణం ఉత్పత్తి ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.
top of page
bottom of page
Comments