ప్రసన్న ఆంధ్ర గాజువాక ప్రతినిధి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయం వ్యవస్థ ఇటు సచివాలయ ఉద్యోగులు అటు గవర్నమెంట్ ఉన్నతాధికారులు వాలంటరీ ల పై ఒత్తిడి తేవడం మొదలవుతుంది దీనివలన కొన్ని సచివాలయాల్లో వాలంటరీ కూడా స్వచ్ఛందంగా మానివేయడం బెదిరింపుల వల్ల మానివేయడం అలాగే చనిపోవడం జరిగింది ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియపరిచిన ఎటువంటి స్పందన రాలేదు. వాలంటరీ మీద పనిభారం పెంచవద్దని ముఖ్య మంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ఎటువంటి పట్టించుకోని వ్యవహారంతో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. సచివాలయం సిబ్బంది మీరు గాని పని చేయకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని లేకపోతే వాలంటరీలు రోజు రావాలి అని బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి గతంలో అన్ని సచివాలయాల్లో నుంచి వాలంటరీ తమ యొక్క జీతాల గురించి పని ఒత్తిడి గురించి ధర్నా చేయడం జరిగింది ఈ విషయంలో ముఖ్యమంత్రివర్యులు జోక్యం చేసుకుని వాలంటరీలు సేవకులు మాత్రమే ఎటువంటి పని ఒత్తిడి ఇవ్వకూడదని వాలంటరీలు ఇతరత్రా పనులు చేసుకోమని సచివాలయ అలాగే ఉన్నతాధికారులకు తెలియపరిచారు కానీ సచివాలయం ఉద్యోగులకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన సచివాలయ ఉద్యోగులు ఉన్నత అధికారులు గాని పెడచెవిన పెట్టి వాలంటరీలకు మెమోలు ఇవ్వడం ఉద్యోగం నుంచి తొలగిస్తామని లేనిచో వాళ్ల చేత బయోమెట్రిక్ వేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. వాలంటరీ లు ఉన్నతాధికారులకు అధికారులు అయితే ఈ విషయాన్ని తెలియపరిచిన సచివాలయ ఉద్యోగులకు వత్తాసు పలకడం మొదలయ్యింది వారి సచివాలయ ఉద్యోగుల సొంత వ్యవహారాలు కూడా వాలంటరీ ల మీద ఒత్తిడి తేవడం జరుగుతున్నదిఅలాగే కొన్ని సచివాలయాల లో ఉదయం 6:00 నుంచి సాయంత్రం 6:00 వరకు విధులు నిర్వహించాలని లేనియెడల మిమ్మలను విధుల నుంచి తొలగిస్తామని దాని వలన మహిళా వాలంటీర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది ఈ విషయం మీద వాలంటరీకి చాలా బాధాకరతో పని పని భారం మోస్తూ చేయలేక మానివేయడం జరిగింది. అలాగా గాజువాక నియోజకవర్గం నుంచి 900 వాలంటరీ విధుల నుంచి మానివేయడం, ఈ ఖాళీలలో కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుని పాతవారు సచివాలయ ఉద్యోగులకు మీకు నచ్చిన వారిని తొలగించమని శ్రీధర్ జోనల్ కమిషనర్ అలాగే ఏ.పీ.డీ మిమ్మల్ని తొలగించమని ఆదేశాలు ఇచ్చారని వాలంటరీ పని చేయని యెడల తొలగిస్తామని అవసరమైతే మీ ప్లేస్ లో కొత్తవారిని రిక్రూమెంట్ చేసుకుంటామని వాలంటరీ పై పని ఒత్తిడి తెస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు విధులకు రావడం నామమాత్రపు బయోమెట్రిక్ వేయడం తప్ప మిగిలిన ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడం. వాలంటరీ లతో చెత్త పన్ను వసూలు చేయమని అలాగే ఇతర పనులు మీద పని ఒత్తిడి పెంచుతూ సచివాలయ ఉద్యోగులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది వాలంటరీ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.
top of page
bottom of page
Comments