top of page
Writer's picturePRASANNA ANDHRA

మా పొట్ట కొట్టవద్దు! మాపై కక్ష సాధింవద్దు! బ్రతకలేం! - వాలంటీర్లు


తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలంలోని, పినపళ్ల గ్రామంలో, సుమారు 15 మంది వాలంటీర్లుగా పనిచేస్తున్న వారిలో ముగ్గురు వాలంటీర్లకు, ఆలమూరు మండలం ఎంపీడీవో ఝాన్సీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగినది. దీనికి కారణం, ఆ గ్రామంలో ఒకరిద్దరు గ్రామ నాయకులు ఉద్దేశపూర్వకంగా, కక్ష పూర్వకంగా మా ముగ్గురు లో ఒక మగ వాలంటీర్,ఇద్దరు మహిళా వాలంటీర్ల పై కేవలం వ్యక్తిగత కక్షలను పెట్టుకుని, ఒకరిద్దరు మండలస్థాయి అధికారులను, ఈ కుట్రలో పావులుగా చేసి, వారిచేత తప్పుడు నివేదికలు తయారుచేయించి, వాలంటరీ ఉద్యోగాల నుంచి శివ కుమార్ కాపు కులస్తుడను, వీరలక్ష్మి దళిత మహిళను, భవాని శెట్టి బలిజ మహిళను అయిన మమ్మల్ని తీసివేయాలని, ఆ వాలంటరీ ఉద్యోగాలను తమ వారికి ఇప్పించాలనే ఉద్దేశంతో ఒక గ్రామ నాయకుడు మా పై గత కొన్ని నెలలుగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, మా ముగ్గురు వాలంటీర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నామన్నారు.. గతంలో మాముగ్గురిని కొద్ది నెలల క్రితం మేము ఏ తప్పు చేయకపోయినా, ఒకసారి వాలంటరీ విధుల నుంచి తొలగించినారని, హైకోర్టును ఆశ్రయించి, తద్వారా తిరిగి వాలంటరీ విధుల్లోకి చేరినామని,ఈ విధంగా మా గ్రామ జనసేన పార్టీ పినపళ్ల సర్పంచ్ సంగీత సుభాష్,మా ముగ్గురు వాలంటీర్లు, మేము ప్రజలకు చేస్తున్న సేవలు మెచ్చి హైకోర్టు నుంచి తిరిగి విధుల్లో చేరే విధంగా ఆర్డర్ కాఫీ ను తీసుకువచ్చి సహకరించినారని అన్నారు. హైకోర్టు వారు విచారణ నిమిత్తం నివేదిక సమర్పించాలని అనడంతో, మా ముగ్గురు పై ఎటువంటి ఆరోపణలు లేవని పంచాయతీ తీర్మానం కూడా చేసి, పింఛన్ ధారుల చేత, రేషన్ కార్డుల లబ్ధిదారులచేత మా ముగ్గురికి మద్దతుగా సంతకాలు కూడా పెట్టించి, పంచాయితీ ద్వారా గ్రామ సెక్రెటరీ, సర్పంచ్ సంగీత సుభాష్ పంచాయితీ బోర్డు మెంబర్స్ తో తీర్మానాలతో, వీరు వ్యక్తిగతంగా మంచిగా విధులు నిర్వహిస్తున్నారని, నివేదిక ఇచ్చినా కూడా, మరల ఆలమూరు మండల స్థాయి అధికారులు ఒక గ్రామ నాయకుడి మాటలు విని, మరలా కోర్టుకు తప్పుడు నివేదిక తయారు చేసి ఇచ్చే విధంగా ఉన్నారని , మీరు కోర్టులో చూసుకోండి అన్నారు., పేదవారైనా మా వాలంటీర్లను, మండల స్థాయి అధికారులు పూర్తిగా కోర్టు పాలు చేస్తున్నారు.మా వాలంటరీ విధుల నుంచి మరల తొలగించే విధంగా ప్రయత్నం చేసి ఉన్నారు. మా వాలంటీర్ల పై వ్యక్తిగతంగా మా పినపళ్ల గ్రామంలో ప్రజలు ఎవరూ కూడా ఎప్పుడూ ఎలాంటి తప్పుగా కంప్లైంట్లు ఇవ్వలేదని తెలియజేశారు. ఎవరు ఏ విధమైన మా ముగ్గురు వాలంటీర్ల పై కంప్లయింట్లు ఇవ్వకపోయినా,మా గ్రామములోని మిగతా వాలంటీర్ల వారిపై ఎవరి మీద, సుమారు 15 మంది వాలంటీర్ల పై ఎలాంటి విచారణ చేయకుండా కేవలం మమ్మల్నే మాత్రమే శిక్షించాలని చూస్తున్నారని. అంతేకాకుండా, ఆలమూరు మండలంలో ఉన్న 18 గ్రామాల వాలంటీర్ల పై, ఎవరి మీద ఎలాంటి విచారణలు చేయకుండా కేవలం వ్యక్తిగత కక్షతో, మా ముగ్గురు వాలంటీర్లను తొలగించాలని, ఈ కుట్ర చేస్తున్నారని వారు ఎంపీడీవో ఝాన్సీ వారి వద్ద ఈరోజు కన్నీటి పర్యంతం అయినారు. ఈరోజు మండల కార్యాలయంలో ఎంపిడిఓ వారి వద్ద, వివరణ నిమిత్తం, నివేదిక సమర్పించడం కోసం పత్రికా విలేకరులు సాక్షిగా వాలంటీర్లు ముగ్గురు కన్నీటి పర్యంతం చెంది ఉన్నారు. న్యాయం చేయమని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ రాయుడు లక్ష్మణ్ రావు వారి ముగ్గురు వాలంటీర్ల తరుపున వారి సమస్యలపై మండల అభివృద్ధి అధికారులతో మాట్లాడి న్యాయం చేయమని కోరారు. ఈ విషయంపై మండల పరిషత్ అధికారులు స్పందిస్తూ మా చేతిలో ఏమీ లేదని, మేము కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నామని తెలియజేశారు. గౌరవ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారు కూడా సహకరించని పక్షంలో మాకు బ్రతుకులేదని, తీవ్రంగా కలత చెంది, తీవ్ర ఆవేదనకు లోనై ఉన్నామన్నారు.


157 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page