వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు నేడు పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొణిరెడ్డి శివచంద్రా రెడ్డి అధ్యక్షత వహించగా ఎం.పి.డి.ఓ ఉపేంద్ర రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎం.పి.డి.ఓ మాట్లాడుతూ సచివాలయ వాలంటరీ వ్యవస్థను కొనియాడారు. సర్పంచ్ కొణిరెడ్డి మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ధన్యావాదాలు తెలుపుతూ, ప్రజలకు ప్రభుత్వ పధకాలు మరింత చేరువ చేయటానికి, పారదర్శకంగా పధకాల అమలుకు వాలంటరీ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతోందని, వాలంటరీల పనితీరు ఆధారంగా ప్రభుత్వం వారిని గుర్తించి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రా పధకాలు ఇవ్వగా తమ పంచాయతీ పరిధిలోని నాలుగు సచివాలయాలు గాను దాదాపు అందరిని ప్రభుత్వం గుర్తించిందని, రాబోవు రోజుల్లో కొణిరెడ్డి ఫౌండేషన్ ద్వారా పంచాయతి పరిధిలో ప్రతిభ కనబరిచిన వాలంటరీలకు ప్రొత్సాహకాలు అందివ్వనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియచేసారు.
ఎం.పి.డి.ఓ ఉపేంద్ర రెడ్డి, సర్పంచ్ కొణిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ, ఎం.పి.టీ.సీ లు వాలంటరీలకు సన్మానం చేశారు. సేవా వజ్ర గా వి.వి.ఎల్ నరసమ్మ అవార్డు అందుకోగా, మరో ఇద్దరికీ సేవా రత్న అవార్డు లభించగా, మిగిలిన వారికి సేవా మిత్ర అవార్డు లభించింది. ఈ సన్మాన సభలో పంచాయతీ పరిధిలోని సచివాలయ సిబ్బంది, వాలంటరీలు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Comentarios