కడప జిల్లా, ఒంటిమిట్టలో ఈ నెల 15న జరుగనున్న శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహణకు సంబంధించి... డిఆర్వో మాలోల, కడప, బద్వేల్ ఆర్డీవోలు ధర్మచంద్రా రెడ్డి, వెంకటరమణ, టిటిడి అధికారులతో కలసి ఒంటిమిట్టలోని కల్యాణోత్సవం వేదిక వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన జిల్లా సంయుక్త కలెక్టర్ సాయికాంత్ వర్మ.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కల్యాణోత్సవం వేదిక వద్ద చేరుకునేందుకు అనువైన ఏర్పాట్లు, అలాగే ప్రముఖులు, అత్యంత ప్రముఖుల ఎంట్రీ పాయింట్, పబ్లిక్ ఎంట్రీ పాయింట్, వారి సీటింగ్ ఏర్పాట్లు, ప్రసాదాల వితరణ పాయింట్లు, బ్యారికేడింగ్ ప్లాన్, పార్కింగ్ , టాయిలెట్స్ తదితర ఏర్పాట్లపై క్షుణ్ణంగా పరిశీలించి..సంభందిత అధికారులకు సలహాలు, సూచనలు జారి చేసిన జేసి సాయికాంత్ వర్మ.
కోదండరామస్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిఐపి, విఐపిలు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, తదనుగునంగా పక్కా ప్రణాళికలతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జేసి సాయికాంత్ వర్మ. అనంతరం కోదండరామస్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించి తీర్త, ప్రసాదాలు స్వీకరించిన జేసి సాయికాంత్ వర్మ.
ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపి, మెప్మా పీడీలు మధుసూదన్ రెడ్డి, రామమోహన్ రెడ్డి, టూరిజం అధికారి రాజశేఖర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శంకర్ బాలాజీ, స్టెప్ సీఈఓ రామచంద్రా రెడ్డి, ఎస్పిడిసిఎల్ ఎస్ఈ శోభా వాలేంటినా, డిపివో ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ హనుమంత రావు, పోలీస్, టిటిడి అసిస్టెంట్ ఏవిఎస్వో మనోహర్, ఈఈ సుమతి, డీఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments