top of page
Writer's pictureMD & CEO

న‌వ‌నీత‌కృష్ణ అలంకారంలో ఒంటిమిట్ట రామ‌య్య

న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో రాముల‌వారు ముగ్ధ‌మ‌నోహ‌రంగా ద‌ర్శ‌న‌మిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ వాయిద్యాలు, భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్న‌దొంగ‌. రేప‌ల్లెలో బాల‌కృష్ణుడు య‌శోద‌మ్మ ఇంట్లోనే గాక అంద‌రి ఇళ్ల‌లోకి వెళ్లి వెన్న ఆర‌గించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీల‌ల‌ను గుర్తు చేస్తూ రాముల‌వారు వెన్న‌కుండ‌తో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఏఈఓ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు.

25 views0 comments

ความคิดเห็น

ได้รับ 0 เต็ม 5 ดาว
ยังไม่มีการให้คะแนน

ให้คะแนน
bottom of page