వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జి గొర్రె శ్రీనివాసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ద్వారా నిన్నటి రోజున వెలువడిన ఉమ్మడి శెట్టి నాగరాజు భార్య ఉమ్మడి శెట్టి నాగలక్ష్మి ఆవేదనపై స్పందించారు. ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్ కు చెందిన ఉమ్మడి శెట్టి నాగలక్ష్మి గత దశాబ్ద కాలం నుండి ఇంటి వద్ద పవర్ లూమ్స్ మగ్గాలు నడుపుకుంటూ జీవనాధారం కొనసాగిస్తుండగా, పక్క ఇంటిలో నివాసం ఉంటున్న జక్కు లక్ష్మి ఆక్షేపణ తెలిపి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి మానసిక క్షోభకు గురి చేసిందని, ఉమ్మడి శెట్టి నాగరాజు వద్దనే తాను నివాసం ఉంటున్న గృహాన్ని జక్కు లక్ష్మి కొనుగోలు చేసి, ఆనాడు పవర్ లూమ్స్ మగ్గాల వలన తమకు ఎటువంటి శబ్ద కాలుష్యం కలుగదని తెలిపి నేడు ఉమ్మడి శెట్టి కుటుంబాన్ని పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదని, పవర్ లూమ్స్ లేదా చేతి మగ్గాలు కుటీర పరిశ్రమ (కాటేజ్ ఇండస్ట్రీస్) క్రిందకు వస్తాయని, వీటిపై ఆధారపడి జీవిస్తున్న వారిపై అనుచితంగా ప్రవర్తించటం సబబు కాదని హితువు పలికారు. జక్కు లక్ష్మి ఫిర్యాదుపై స్థానిక పోలీసులు, రెవిన్యూ సిబ్బంది పరిశీలించగా ఉమ్మడి శెట్టి నాగలక్ష్మి చేస్తున్న చేతి వృత్తి పని సబబే అని తెలిపారని, కానీ కొందరు నాయకుల ప్రోద్బలంతో ఉమ్మడి శెట్టి కుటుంబంపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సరికాదని, ఇలాంటి చర్యలు ఇకనైనా మానుకోవాలని చేనేత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. చేనేత కుటుంబాలకు ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, సమస్యలు ఏవైనా తమ వద్దకు తెస్తే పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జి గొర్రె శ్రీనివాసులు, పట్టణాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు పల్లె రఘురామి రెడ్డి పాల్గొన్నారు.
コメント