top of page
Writer's picturePRASANNA ANDHRA

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎందుకు అంత ప్రాధాన్యత?

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎందుకు అంత ప్రాధాన్యత?


పది రోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు?


ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి?


మానవులుకు 365 రోజులు, దేవతలకు ఒక్కరోజుతో సమానం


మానవులుకు 6 నెలల కాల సమయం, దేవతలకు 12 గంటల సమయం


దేవతలకు 12 గంటల రాత్రి సమయాని దక్షిణాయం అని, పగలు 12 గంటల సమయాని ఉత్తరాయణం అని అంటారు


దక్షిణాయంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం, దినినే కర్కాటక మాసం అంటారు


రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం, 8 నుంచి 10 గంటల సమయాని సింహ మాసం అంటారు


రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం, ఈ కాలం మానవులుకు కన్యా మాసం


అర్దరాత్రి 12గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం, మానవులుకు తులామాసం


మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు, ఉదయం 2 నుంచి 4 గంటల సమయాని మానవులుకు వృశ్చికమాసం


మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు, ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని దనుర్మాసంగా పిలుస్తారు


దేవతలకు ఒక్క గంట సమయం, మానవులుకు 15.2 రోజులుతో సమానం


దేవతలకు 40 నిముషాల సమయం, మానవులుకు 10 రోజులుతో సమానం


ఈ 10 రోజులు కాలమే, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు.


దినితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో, ఏ రోజు దర్శనం చేసుకున్నా, ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్దిస్తాయి.


ఓం నమో వెంకటేశాయ నమో నమః





10 views0 comments

Commentaires

Noté 0 étoile sur 5.
Pas encore de note

Ajouter une note
bottom of page