గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, జీవీఎంసీ లో మంచినీటి సరఫరా విభాగం లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగల జీతాలు కోసం గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్వర్యంలో గాజువాక వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పర్యటక శాఖ మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాస్, విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్ కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. గ్రేటర్ విశాఖపట్నం మంచి నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు పరచిన కొత్త జీతాలు జీ ఒ ను ఆములు చేయాలి అని, వారికి రావలసి కొత్త జీతాలు లలో జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీను వాసురావు, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కమిషనర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కు జరిగిన అన్యాయం, రావలసిన జీతాలు గురించి రావలసిన జీ ఒ ను అములు చేయాలి అని తిప్పల దేవన్ రెడ్డి, విశాఖపట్నం మునిసిపల్ సీఐటీయూ యునియన్ నాయకులైన వెంకటరెడ్డి వివరించారు. దానికి మంత్రి వర్యులు, జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి దీనికి సంబంధించిన మంచినీటి సరఫరా అధికారులతో తక్షణమే చర్యలు తీసుకోమని తగు న్యాయం జరగాలని దానిపై వివరణ కావాలని ఆదేశాలు జారీ చేసారు . ఈ కార్యక్రమంలో గాజువాక వైస్సార్సీపీ ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి, విశాఖ మునిసిపల్ సీఐటీయూ యూనియన్ నాయకులు వెంకటరెడ్డి, దుగ్గపు దానప్పలు, సునీల్, రామకృష్ణ రాజు, గోవిందా, భాస్కర్ రాజు, సూరిబాబు, రాఘవ, చిట్టిబాబు, దుర్గ్ ప్రసాద్, సన్యాసిరావు, వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments