భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పై నిర్లక్ష్యం వహిస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైకిరి పై ధ్వజమెత్తిన అగనంపూడి ప్రతిపక్ష కార్మిక సంఘాలు నాయకులు.
అగనంపూడి సిడబ్ల్యుసిలో అగనంపూడి శ్రీ బొర్రమాంబ బిల్డింగ్ వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన స్థానిక ప్రతిపక్ష కార్మిక సంఘాలు సమావేశంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ ప్రసంగిస్తూ రాష్ట్రములో 25 లక్షల మంది భవన కార్మికులు ఉన్నారని వీరందరూ సమస్యలపై వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భవన నిర్మాణ యాజమాన్యము నుండి ఒక శాతం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సెస్సు రూపంలో వసూలు చేస్తున్న నిధులు కార్మిక శాఖ జమ చేయకుండా ఇతర కార్యక్రమాలు కి దారి మళ్లిస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా పనిముట్లు అందజేశారని ప్రస్తుత ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని నిలిపివేసింది అన్నారు. భవన నిర్మాణ కార్మికలు గుర్తింపు కార్డులు కోసం బ్యాంకు చలనాలు తీశారని కానీ ఇప్పటికీ గుర్తింపు కార్డులు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని సమస్యలు పరిష్కారానికి అధికారులు ప్రయత్నం చేయడం లేదని అన్నారు భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు విద్యను అభ్యసించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అమలుచేసిన పిల్లల స్కాలర్షిప్ వివాహ ఆర్థిక సహాయం పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నారు. కరోనా సమయములో పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ఆదుకోలేదని అన్నారు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని 3 సంవత్సరాలుగా అనేక రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్వందిచ లేదని అన్నారు. ప్రస్తుత జరుగుతున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భవన నిర్మాణ కార్మిక సమస్యలపై ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమా కార్యక్రమాలు ప్రకటించలని బలిరెడ్డి డిమాండ్ చేసారు.
అగనంపూడి శ్రీ బొర్ర మాంబా బిల్డింగ్ వర్కర్స్ సంఘం అధ్యక్షులు సాయిన అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐ ఎన్ టి యు సి నాయకులు దానబోయిన అప్పలనాయుడు, బిజెపి నాయకులు కోసురి తాతారావు, ఏఐటీయూసీ నాయకులు అలమండ శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు చట్టి నర్సింగరావు, తెలుగు యువత నాయకులు ఎలమంచిలి రమణ, గాంధీజీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చిత్త రామారావు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
Comentarios