భారత్‌తో పాటు పలు దేశాల్లో నిలిచిపోయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుమారు 95 నిమిషాల తర్వాత సేవలను పునరుద్ధరించించి మాతృ సంస్థ మెటా. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల యూజర్లు మెసేజ్‌లు పంపేందుకు ఇబ్బందులు పడ్డారు.
మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత.. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించకపోవటం, డబుల్ టిక్, బ్లూటిక్ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో పడ్డారు యూజర్లు. సమస్య తలెత్తిన తర్వాత వేల మంది వినియోగదారులు వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments