మానవత్వం మంటగలిసిన వేళ మానవత్వాన్ని మరిచి రోడ్డుపై పడేశారు
వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మరియు సిబ్బంది నిర్వాకానికి ఇది పరాకాష్ట, ఉదయం సామాజిక మాధ్యమాలలో ప్రసారమయిన ఒక ముదుసలి వ్యక్తి దీనగాధను ఇప్పటి వరకు అనగా రాత్రి 8:00 గంటల వరకు పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది మరియు డాక్టర్లు. వివరాల్లోకి వెళితే ఇతని పేరు కేశవరెడ్డి, తలకు రెండు వైపులా తగిలిన గాయాలకు కుట్లు వేసి ఉన్నారు. అంటే ఇతను జిల్లా ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ అయి ఉండవచ్చు.
ఇతనికి ఒక చెయ్యి, ఒక కాలు పక్షవాతం రావడంతో పనిచేయడం లేదు. ఇతని భార్య పేరు లక్ష్మీదేవి అని చెబుతున్నాడు. మరి జిల్లా ఆస్పత్రి నుంచి బెడ్ తో సహా బయటికి ఎవరు తీసుకొచ్చి పడేశారు అనేది ఇక్కడ ప్రశ్నర్థకం. అతని కుటుంబ సభ్యులు ఎవరు అన్న వివరాలు ఆస్పత్రిలో వాకబు చేస్తే, ఇతని కేస్ షీట్ పరిశీలిస్తే తెలిసే అవకాశాలు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రిలో చేర్పించడం మానవత్వం మరిచి వదిలి వెళ్లిపోవడం కొందరు బిడ్డలకు ఆనవాయితీగా మారింది. అతని అవయవాలు పని చేయకపోతే ఇక పనికిరాడని వదిలి వేసుకోవడం వలన మానవత్వం మంటగలిసి పోతోంది అన్న దానికి ఇది నిదర్శనం, ఇలా ఎవరూ చూసుకోలేని వారిని ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చి పడేయడం కూడా ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇలా ఉండగా విషయం తెలుసుకున్న 'జ్యోతి' దినపత్రిక ప్రతినిధి శ్రీ పి. శ్రీధర్ గారు సంఘటనా స్థలానికి చేరుకొని మండుటెండలో ఆకలికి అలమటిస్తున్న కేశవ రెడ్డి ని నీడ పాటుకు చేర్చి తన మానవత్వాన్ని, సమాజం పట్ల తనకున్న భాధ్యతను నిర్వర్తించారు. అయితే ఇప్పటివరకు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి ఎదుట ఆస్పత్రి నుంచి రోడ్డుపైకి చేర్చబడ్డ వృద్ధుని గురించి ఇప్పటి వరకు స్పందించని జిల్లా ఆస్పత్రి అధికారులు మరియు సిబ్బంది. తక్షణమే తగు వైద్యం అందించి మెరుగయిన చికిత్స చేయవలసిందిగా ఇతిన్ని చూసిన వారు కోరుకుంటున్నారు.
Comments